తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి హరీష్ రావు మీడియాకు వివరిస్తున్నారు.

కేబినెట్ నిర్ణయాలు :


సొంత జాగ ఉన్నవారు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు ఆర్థిక సాయం పథకానికి ‘గృహలక్ష్మి పథకం’గా పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని నిర్ణయం. ఒక్కో లబ్ధిదారుడికి రూ. 3 లక్షలు అందజేత.


రాష్ట్రంలోని లక్షా 30 వేల కుటుంబాలకు దళితబంధు పథకం ఇవ్వాలని నిర్ణయం  


 ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయం

పొడు భూముల సమస్య పరిష్కారారిని నిర్ణయం. 4 లక్షల ఎకరాల పొడు భూములను అర్హులైన గిరిజనులకు పంపిణీ.  

ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ లో నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ.

జీవో 58,59 కింద నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం.


కాశీలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహం నిర్మించాలని నిర్ణయం. ఇందుకోసంరూ. 25 కోట్ల నిధులు మంజూరు 

కేరళ శబరిమలలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయం. ఇందుకోసం రూ.25 కోట్ల నిధులు మంజూరు.