ముందు.. వెనుక కవితకు మరకల్లేవ్. బై.. బై మోడీ !
నెగిటివ్ కూడా పాజిటివ్ గా మార్చుకోవడమే రాజకీయం. తాజాగా ఈ విషయంలో బీఆర్ఎస్ వందశాతం సక్సెస్ అయినట్లు కనబడుతుంది. ఈ ఉదయం సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరైంది. దాదాపు గంటపాటుగా ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే శుక్రవారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా , ఢిల్లీలోనూ కవితకు మద్దతుగా పోస్టర్లు.. ఫ్లెక్సీలు.. వెలిశాయి.
ఇందులో గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేసిన వారు ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే కవిత విచారణ కు ముందు , తర్వాత కూడా కలర్ మారలేదు. ట్రూ కలర్స్ నెవర్ ఫేడ్ అనే కొటేషన్ తో వెలిసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. మరోవైపు కవిత కు వ్యతిరేకంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసగా బీఆర్ ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగాయి. ఖబద్దార్ బండి సంజయ్ అంటూ ఆయన ఇంటిని..బీజేపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశాయి. మొత్తానికి.. కవిత అరెస్ట్ కాబోతున్న నేపథ్యంలో బీఆర్ ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.