ఈడీ ముందుకు కవిత.. సాయంత్రానికల్లా అరెస్ట్ ?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. తుగ్లక్‌ రోడ్‌లోని కేసీఆర్‌ నివాసం నుంచి ఈడీ ఆఫీస్‌కు కవిత చేరుకున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త అనిల్‌, న్యాయవాదులు ఉన్నారు. పిడికిలి బిగించి అభివాదం చూస్తూ కవిత ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు.

మరోవైపు సీఎం కేసీఆర్ నివాసం,  ఈడీ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయడం ఖాయం. ఈ సాయంత్రం కల్లా ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజంగానే కవితను అరెస్ట్ చేస్తే అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ లో ఆందోళనలు చేసేందుకు బీఆర్ ఎస్ శ్రేణులు ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.