Oscars2023 : దీపికా హాలీవుడ్ లుక్

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి షాంపైన్ రంగులోకి మారిన రెడ్ కార్పెట్ పై హోయలు ఒలకబోస్తున్నారు. అయితే హాలీవుడ్ తారలతో పోటీ పడుతూ.. బాలీవుడ్ భామ దీపికా పదుకొనె బ్లాక్ కలర్ డ్రెస్ లో.. మెడలో డైమాండ్ హారంతో తళుక్కున మెరిసింది.

ఇక ఆర్ ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దర్శకుడు రాజమౌళి, కథానాయకులు ఎన్ టీఆర్, రామ్ చరణ్, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్.. రెడ్ కార్పెట్ పై మెరిసిపోతున్నారు. మొత్తంగా.. ఆస్కార్ వేదికగా తెలుగు సినిమా మురిసిపోతుంది. నాటు నాటు గా డ్యాన్స్ చేస్తోంది.