ఎన్టీఆర్ ఆస్కార్ లుక్.. అదిరింది !

ఆస్కార్ వేదిక గా తెలుగు సినిమా మురిసిపోతుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా 9వ ఆస్కార్ వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. కొమురం భీమ్ యంగ్ టైగర్ ఎన్ టీఆర్, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ బ్లాక్ సూటులో మెరవగా.. దర్శకధీరుడు రాజమౌళి మెరూన్ కలర్ సూటు లో కనిపించారు. ఆస్కార్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ఇచ్చిన పోజులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

మరికొద్దిసేపట్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించబోతున్నారు. నాటు నాటుకు అవార్డు గ్యారంటీ ప్రతీ భారతీయుడు భావిస్తున్నారు. ఇక బాలీవుడ్ భామ దీపికా పదుకొనె ఆస్కార్ వేదికపై తళుక్కున మెరిసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో హాలీవుడ్ లుక్ లో మెస్మరైజ్ చేసింది.