అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా !

పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల నుంచి డేటాను చోరీ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తుల వ్యక్తిగత డేటా చోరీ చేసి సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.

పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్‌ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం తస్కరించినట్లు గుర్తించాం. ఫేస్‌బుక్‌ యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు, ఐటీ ఉద్యోగుల డేటాను సైతం చోరీ చేశారు. డిఫెన్స్‌, ఆర్మీ ఉద్యోగుల డేటా అంగట్లో అమ్మకానికి పెట్టారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు వివరించారు.