ఎన్టీఆర్ – జాన్వీ.. చూడముచ్చటైన జంట !

ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబో సూపర్ డూపర్ హిట్. వీరి కాంబోలో చాలా సినిమాలొచ్చాయి. ఇందులో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఎన్ టీఆర్ మనవడు జూ. ఎన్ టీఆర్, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తెలుగు ప్రేక్షకుల చిరకాల కోరిక. ఇప్పుడీ.. ఈ కోరిక తీరబోతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్ టీఆర్ నటిస్తున్న సినిమా కోసం జాన్వీని తీసుకున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు జాన్వీ హాజరైంది. ఈ సందర్భంగా తారక్ – జాన్వీపై తొలి షాట్ ను చిత్రీకరించారు. జాన్వీకి వెల్ కమ్ చెబుతూ… తారక్ కొద్దిసేపు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి.. తారక్ -జాన్వీ జంట చాలా చూడముచ్చటగా కనబడుతోంది.

ఇక సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ సినిమా లైన్ గురించి దర్శకుడు కొరటాల చెప్పేశారు. కోస్టర్ ల్యాండ్స్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఇందులో మనుషులు కంటే మృగాలే ఎక్కువ. ఎవ్వరికి భయం ఉండదు. వారికి భయం తీసుకొచ్చే పాత్రలో తారక్ కనిపిస్తారు. ఆ పాత్రను ఏ రేంజ్ లో చూపించబోతున్నాను అన్నది సస్పెన్స్. ఇదొక ఎమోషనల్ రైడ్.. తన చిత్రాల్లో ది బిస్ట్ గా ఉంటుంది అని హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
