#NTR30 కథ ఇదే !

ఎట్టకేలకు #NTR30 ప్రారంభమైంది. గురువారం ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వేడుకకు తారక్ – జాన్వీ హాజరయ్యారు. ముహూర్తపు షాట్ కు రాజమౌళి క్లాప్ కొట్టగా.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెమెరా ఆన్ చేశారు.

ఇక సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ సినిమా లైన్ గురించి దర్శకుడు కొరటాల చెప్పేశారు. కోస్టర్ ల్యాండ్స్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఇందులో మనుషులు కంటే మృగాలే ఎక్కువ. ఎవ్వరికి భయం ఉండదు. వారికి భయం తీసుకొచ్చే పాత్రలో కథానాయకుడు కనిపిస్తారు. ఆ పాత్రను ఏ రేంజ్ లో చూపించబోతున్నాను అన్నది సస్పెన్స్. ఇదొక ఎమోషనల్ రైడ్.. తన చిత్రాల్లో ది బిస్ట్ గా ఉంటుంది అని హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
#NTR30 Story Line: Film set in a forgotten land of coastal India. Men in this land don’t fear God, don’t fear Death but what do they fear for? pic.twitter.com/lVewmaPaqg— Aakashavaani (@TheAakashavaani) March 23, 2023