ధరణి-రావణాసుర.. ఫుల్ ఎనర్జీ !

మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని కలిశారు. ఇద్దరి మధ్య మాటలు షురూ అయినవి. ఆ తర్వాత అవి ఎక్కడికో వెళ్లినట్టున్నాయి. ఇద్దరు ఈ లోకాన్ని మరచిపోయి.. విహరించేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రవితేజ – నానికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. నాని కూడా అంతే. అందుకే.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వరకు వీరు రోల్ మోడల్.
ఇక నాని దసరా, రవితేజ రావణాసుర సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి చిట్ చాట్ చేశారు. కూర్చొని.. నిలబడి.. బోలేడు సినిమా కబర్లు చెప్పుకున్నట్టు ఉన్నారు. ప్రస్తుతానికైతే.. వీరి ఫోటోలు బయటికొచ్చాయి. వీరి మాటలు ఇవాలో.. రేపో విపిబడబోతున్నాయి.
