వాళ్ల మీద తోసేశాడు

2-1 తేడాతో వన్డే సిరీస్ ఆసీస్ కు సమర్పించుకున్న టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్-2023 కోసం రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ ముంగిట ఐపీఎల్‌ జరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లపై పనిభారం గురించి చర్చ మొదలైంది.

తాజాగా దీనిపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆటగాళ్ల మీద పడకుండా చూడాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదేనన్నారు. అంతేకాదు.. ప్రపంచకప్‌ వరకు ఫిట్‌గా ఉండాల్సిన బాధ్యత ఆటగాళ్లదే నని రోహిత్‌ పేర్కొన్నాడు. మొత్తానికి.. ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల మీద బాధ్యత పడేసి.. బీసీసీఐ కామ్ అయిపోయింది అన్నమాట.

ఇక మార్చి 31 నుంచి ఐపీఎల్‌ ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌ గుజరాత్, చెన్నై జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరుగుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ జూన్‌ 7 నుంచి ప్రారంభంకానుంది.