దసరా.. కోర్ పాయింట్ ఇదే !

నేచురల్ స్టార్ నాని కథల ఎంపికలో టేస్ట్ ఉన్న కథానాయకుడు. ఆయన గట్టి నమ్మకంతో చెప్పిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దసరా గురించి నాని గొప్పగా చెబుతున్నారు. ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ చిత్రాల మాదిరిగా దసరా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారని చెబుతున్నారు. దసరా ప్రచార చిత్రాలు చూస్తే.. అది నిజమే అనిపిస్తుంది.

అయితే ఈ సినిమా కథేంటీ ? అన్నది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ధరణి పాత్రలో నాని కనిపిస్తారు. బొగ్గు బొగ్గుల దొంగ అని మాత్రమే చెప్పారు. అయితే ఇప్పుడు కోర్ పాయింట్ ఏంటీ అన్నది బయటికొచ్చింది. స్నేహం, ప్రేమ‌, ప‌గ‌.. ఈ మూడింటి మ‌ధ్య ద‌స‌రా సాగ‌బోతోంది. స్నేహితుడి మ‌ర‌ణానికి హీరో తీసుకొనే రివైంజ్ ఈ సినిమా. ఇందులోని ప్రేమ క‌థ‌లోనూ పెయిన్ ఉంటుంద‌ని తెలుస్తోంది .వచ్చే వారమే దసరా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మరీ.. దసరా హిట్ అయితే నాని కూడా పాన్ ఇండియా స్టార్స్ జాబితాలో చేరిపోయినట్టే.

అనంతపూర్ దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ :  
దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, టైమ్ ఫిక్సయింది. రేపు సాయంత్రం అనంతపూర్ లో ధూమ్ ధామ్ గా దసరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు.