ఆప్ ఎంపీతో పరిణీతి పెళ్లి ఫిక్స్ !?

కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా తర్వాత ఎవరు ? అనే దానికి సమాధానం దొరికినట్టుంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లి న్యూస్ చెప్పేసేనట్టేనని అంటున్నారు. దీనికి కారణం.. ఆమె ప్రియుడుతో కలిసి లంచ్ కి వెళ్లడం.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే.

ఇంతకీ పరిణీతి చోప్రా పక్కనున్నది ఎవరో తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.3 4 ఏళ్ల రాఘవ్, రాజ్యసభలో పిన్నవయష్కుడిగా గుర్తింపు పొందాడు. పార్టీలో అతడికి మంచి పేరుంది. ఇతడు 34 ఏళ్ల పరిణీతికి దగ్గరయ్యాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ వార్తలు నిజమే అన్నట్టు.. సమయం దొరికినప్పుడల్లా.. పరిణీతి – రాఘవ్ లంచ్, డిన్నర్ భేటీల్లో కనబడుతున్నారు.
परिणीति चोपड़ा के साथ दिखे राघव चड्ढा…. चर्चाओं का बाजार गर्म, लोग लगा रहे तरह तरह के कयास#RaghavChadha #parinitichopra pic.twitter.com/eQL2fxJEFK— Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) March 24, 2023