#RC15 అఫీషియల్ ఎనౌన్స్ మెంట్

మెగా అభిమానులకు గుడ్ న్యూస్. #RC15 అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రేపు #RC15 నుంచి ఓ స్పెషల్ అప్ డేట్ ఇవ్వనున్నారు. అది టీజర్ నా, టైటిల్ పోస్టర్ నా.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 
వాస్తవానికి శుక్రవారం నుంచే #RC15 సెట్ లో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ అయినవి. ఆరోజు ఈ సినిమా సాంగ్ షూట్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ కియారా, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఆధ్వర్యంలో రామ్ చరణ్ కేక్ కట్ చేసి.. సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక బర్త్ డే కానుకగా సోమవారం అభిమానుల కోసం అదిరిపోయే గిఫ్ట్ అందజేయబోతున్నట్లు టాక్. ఈ బర్త్ డే మెగా ఫ్యామిలీకి వెరీ వెరీ స్పెషల్. ఆర్ ఆర్ ఆర్ లోని సాంగ్ నాటు నాటు కు ఆస్కార్ వరించింది. రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్  పొందబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి.