రాముడు ‘వర్సెస్’ హనుమాన్

‘రామాంజనేయ యుద్ధం’ జరిగింది. ఇందులో విజేత ఎవరు ? అన్నది మాత్రం సస్పెన్స్. అయితే ప్రస్తుతం జరుగుతున్న రామాంజనేయ యుద్ధం లో విజేత హనుమాన్ నే. అవునూ.. ఓం రౌతు దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్.. ప్రధాన పాత్రల్లో ఆదిపురుష్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రామాయణ యుద్ధకాండ గా ఆదిపురుష్ తెరకెక్కుతోంది. రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురడి పాత్రలో సైఫ్ కనిపించబోతున్నారు. జూన్ 16న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. అయితే ఆదిపురుష్ తో పోలిస్తే హనుమాన్ బాగుందని ఈ రెండు టీజర్లు చూసిన జనాలు చెప్పుకుంటున్న మాటలు. టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఆదిపురుష్ యానిమేషన్ సినిమాలా ఉందని పెదవి వరిచారు. స్టార్ కాస్టింగ్ ను వేస్ట్ చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో హనుమాన్ టీజర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.

తాజాగా శ్రీరామనవమి సందర్బంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ల విషయంలోనూ హనుమాన్ దే పై చేయిగా కనిపించింది. ఆదిపురుష్ రాముడు-సీత.. లక్ష్మణ సమేతంగా ఉన్న పోస్టర్ తో శుభాకాంక్షలు తెలుపగా.. హనుమాన్ మాత్రం గుండెల్ని చూల్చి సీతారాముల వారిని చూపించారు. మొత్తానికి.. రాముడు వర్సెస్ హనుమాన్ యుద్ధం కొనసాగుతుంది.