దసరా.. ధూమ్ ధామ్ !

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని – కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దసరా’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరో రంగస్థలం అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. దర్శకుడు శ్రీకాంత్‌  కు ఇదే తొలి సినిమా కానీ అనుభవం ఉన్న డైరెక్టర్ లా కథ-కథనాలు నడిపించారు. కథ నేపథ్యం సినిమాకు ప్రధాన బలం. నటీనటుల అద్భుత నటన సినిమాను స్థాయిని మరింత పెంచింది.

ముఖ్యంగా ధరణి పాత్రలో నాని అదరగొట్టాడు. కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక వెన్నెల గా కీర్తి సురేష్ జీవించేసింది. మహానటి తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకుంది కీర్తి అంటున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. దసరా లో రంగస్థలం పోలికలు చాలా ఉన్నాయి. రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది అంటున్నారు. మొత్తానికి దసరా బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రేక్షకులు తేల్చేశారు.

నాని ముందు నుంచి చెబుతున్నట్టు  ఇండస్ట్రీ ఓ మంచి దర్శకుడిని పరిచయం చేస్తున్నానన్నారు. ఇప్పుడు అదే జరిగింది. దాంతో పాటు బాహుబలి, కేజీఎఫ్ సినిమాల మాదిరిగా దసరా గురించి మాట్లాడుకుంటారని చెప్పారు. ప్రస్తుతానికైతే.. దసరా పాటలు మారుమ్రోగిపోతున్నాయి. సినిమా గురించి కూడా ఆ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటే.. ఇండస్ట్రీ రికార్డులు బద్దలే.