కోల్‌కతాపై పంజాబ్, ఢిల్లీపై లఖ్‌నవూ గెలుపు

ఐపీఎల్-16 భాగంగా ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు పసందైన వినోదాన్ని పంచాయి. మొదటి మ్యాచ్ లో కోల్‌కతాపై పంజాబ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. తర్వాత భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈలక్ష్య ఛేదనలో దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) ఒంటరి పోరాటం చేశాడు.