నువ్వు మా సీతవు కాదు
వచ్చిన పేరు నిలబెట్టుకోవడం కూడా టాలెంట్ నే. అయితే ఈ విషయంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫెయిల్ అయింది. మిగతా ఇండస్ట్రీలో ఆమె ఎలాంటి ఇమేజ్ ఉన్నా.. టాలీవుడ్ లో మాత్రం మృణాల్ పై సీత గా ముద్రపడింది.
‘సీతారామం’ సినిమాలో ఆమె చేసిన సీత పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ ఫీల్‌గుడ్ ప్రేమకథాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె చీరకట్టులో యువరాణిగా మెరిసిపోయారు. దీని తర్వాత ఆమెను అందరూ సీతగానే గుర్తు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల వెకేషన్‌కు వెళ్లిన మృణాల్.. బీచ్‌లో బికినీతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేయగా.. నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘మా సీత ఇలా ఉండదు’, ‘నువ్వు మా సీతవు కాదు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతలా దిగజారాలా ? అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. బ్లూ బికినీలో మృణాలో గ్లామర్ షో అదిరిపోయింది.