వంద కోట్ల దసరా.. ! కరీంనగర్ మస్త్ దావత్ !!
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘దసరా’. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. కేవలం 7 రోజుల్లోనే.. రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం కరీంనగర్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. తెలంగాణ మంత్రి గుంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ భాష/యాసను విలన్ తదితర పాత్రలకే పరిమితం చేసేవారని, ఇప్పుడు ఆ యాస లేనిదే సినిమా లేదనే పరిస్థితి నెలకొందని గంగుల అన్నారు.
నానిలాంటి యాక్టర్‌ని రూ.100 కోట్ల వసూళ్ల పోస్టర్‌పై చూడాలనుందని ‘దసరా’ ప్రారంభానికి ముందు శ్రీకాంత్.. ఓ కో- డైరెక్టర్‌తో అన్నాడట. ఆ కోరిక ఈ రోజుతో ఈ వేదికపై తీరింది. ఎవరి మాట వినకుండా మీకు నచ్చింది చేయండి. ప్రాణం పెట్టి పనిచేయండి.. విజయం తప్పక వరిస్తుందని నాని అన్నారు. ఈ గెలుపు నా ఒక్కడిదే కాదు దసరాకు పనిచేసిన ప్రతి ఒక్కరిది. మీ అందరిది అంటూ నాని ఆనందం వ్యక్తం చేశారు.