పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

రాజస్థాన్ ను పంజాబ్ ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో పంజాబ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్లు శిఖర్ ధావన్ (86నాటౌట్), ప్రభ్ సిమ్రన్ సింగ్ (60) దంచికొట్టారు. వీరితోపాటు జితేశ్ శర్మ (27) దూకుడుగా ఆడాడంతో పంజాబ్ స్కోర్ 200 కి చేరువైంది. రాజస్థాన్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2.. అశ్విన్, చాహల్ చెరో వికెట్ తీశారు.

ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ను ఎల్లిస్ (4/30) దెబ్బకొట్టాడు. బట్లర్ (19)తో పాటు శాంసన్, పరాగ్ (20), పడిక్కల్ (21) ను అవుట్ చేశాడు. అయితే హిట్ మేయర్ (36), జురెల్ (32) ఆఖరి వరకు పోరాడిన ఫలితం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 192 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 5 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది.
