SSMB29.. మూడు భాగాలు.. ముగ్గురు హీరోయిన్స్ !

త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా #SSMB28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ (#SSMB29) సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాపై పూర్తి స్థాయిలో జక్కన్న ఫోకస్ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో #SSMB29 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ తో పాటు కమల్ హాసన్, చియాన్ విక్రమ్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే బజ్ వినిపిస్తోంది. ఇంకోవైపు ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. వారి పేర్లు కూడా ఖరారయ్యాయి. హాలీవుడ్ హీరోయిన్ జెన్నాఒర్టెగా తో పాటు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపికైనట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. ఈ నెల 30 లేదా 31న ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది అని తెలుస్తోంది. రాబోయే 8 ఏళ్లలో ఈ ప్రాంఛైజ్ లో మూడు సినిమాలు రాబోతున్నాయని సమాచారం.

