అఫీషియల్ : #NTR30 విలన్ సైఫ్

కొరటాల శివ డైరెక్షన్ లో #NTR30 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ కాగా.. విలన్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పేరును చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు కొరటాల, ఎన్టీఆర్ తో కలిసి ముచ్చటిస్తున్న సైఫ్ ఫోటోలు విడుదల చేసింది.

ఆదిపురుష్ తర్వాత సైఫ్ నటిస్తున్న (టాలీవుడ్ నుంచి వస్తున్న) రెండో పాన్ ఇండియా సినిమా ఇది. ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సైఫ్ పాత్ర బలంగా ఉంటుంది. ఎన్ టీఆర్ – సైఫ్ ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అబ్బురపరుస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక కొరటాల సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా  ఉండనుంది.