EXCLUSIVE : ‘జవాన్’ కోసం షారుక్-దీపిక స్పెషల్ సాంగ్ .. ఫోటోలు లీకు !

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ – దీపికా పదుకొనె సడన్ సప్రైజ్ ఇచ్చారు. ‘పఠాన్’ తర్వాత ఈ జంట మరోసారి జతకట్టింది. జవాన్ కోసం మరోసారి కలిసి స్టెప్పులేస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కు సంబంధించిన లీకైన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ-టైమ్స్ ఈ ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోల్లో షారుక్, దీపిక క్లాస్ లుక్ లో కనిస్తున్నారు. బ్లాక్ పాయింట్, వైట్ షర్ట్స్ ధరించి.. మ్యాచింగ్ బ్లాక్ బూట్‌లతో కనిపించారు. దీపిక తన జుట్టును స్కార్ఫ్‌తో ఎత్తైన పోనీటైల్‌లో కట్టుకుంది. డ్యాన్స్ సీక్వెన్స్‌లో వీరిద్దరు కూడా ఎరుపు బ్లేజర్‌లు.. మెడలో స్కార్ఫ్‌లతో కనిపించారు

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పఠాన్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఈ లోగా జవాన్ తో మరోసారి స్టెప్పులేసి.. దీపికా స్పెషల్ గిఫ్ట్ అందించినట్టయింది.