కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న

తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. మంగళవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తాను త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. తన పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ అని తెలిపాడు.

తీన్మార్ మల్లన్నకు మల్కాజ్ గిరి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మల్లన్నతో పాటు ఆయన స్టాప్ సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ లు కూడా రిలీజ్ అయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు చర్లపల్లి జైలుకి చేరుక్కొని మల్లన్నకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్మాడని, తాము వీకర్ సెక్షన్స్ తో ఉన్నామని చెప్పారు.