వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. హైదరాబాద్ ఓటమి !

ఆఖరి రెండు ఓవర్లు హైదరాబాద్ గెలుపుకు 20 పరుగులు కావాలి. ఆఖరి ఓవర్ 9 పరుగులు మాత్రమే కావాలి. క్రీజులో సమద్ (21) మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. దీంతో సన్ రైజర్స్ గెలుపు గ్యారంటీ అనుకున్నారంతా. కానీ కోల్ కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి మాయ చేశాడు. ఆఖరి ఓవర్ లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి.. సమద్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒత్తిడిలో ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. దీంతో 5 పరుగుల తేడాతో కోల్ కతా విన్ అయింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (42), రింకూ సింగ్‌ (46) రాణించారు. జేసన్‌ రాయ్‌ (20), ఆండ్రూ రస్సెల్‌ (24) పర్వాలేదనిపించారు.అనంతరం 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది.