డోస్ పెంచిన రకుల్.. అందుకేనా !?

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచేసింది. మొన్న బికినీలో రచ్చ చేయగా.. నిన్న బ్లాక్ డ్రెస్ లో బొడ్డు అందాలతో పిచ్చెక్కించింది. మునుపెన్నడూ లేనంతగా తనలోని గ్లామర్ యాంగిల్స్ ను చూపించే ప్రయత్నం చేసింది.

సడెన్ గా రకుల్ రెచ్చిపోవడానికి కారణాలు ఏంటీ ? అని ఆమె అభిమానులు ఆరా తీసుకున్నారు. గత ఏడాది రకుల్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. ఏకంగా ఐదు బాలీవుడ్ లో నటించింది. ఈ ఏడాది కూడా రకుల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే ఆమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ హిట్ కావడం లేదు. మరోవైపు ఆల్రెడీ సైన్ చేసిన ప్రాజెక్టులు కాకుండా కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. దీంతో వెనుక పడిపోయినట్టు భావించిన ముద్దుగుమ్మ.. గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ఆ మధ్య కాస్త బొద్దుగా కనిపించినా.. తాజాగా నాజుగ్గా మారింది. మరీ.. ముఖ్యంగా ఆమె బొడ్డు అందాలను యువత ఫిదా అయిపోతున్నారు.