ఆదిపురుష్ ట్రైలర్ .. రెడీగా ఉన్నారా ?

రాముడు ఆగమనానికి సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో (మధ్యాహ్నం 1:53) ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఇందుకోసం మేకర్స్ అంతా రెడీ చేశారు. ఏఎంబీ సినిమా లో ట్రైలర్ రిలీజ్ కోసం డార్లింగ్ ప్రభాస్ హాజరుకానున్నారు. ఈ లోగా ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైట్ అండ్ వైట్ లో ప్రభాస్ మెరిసిపోతున్నాడు. కృతి సనన్ కలిసి ముచ్చటిస్తున్న ఫోటోలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న ఆదిపురుష్ ట్రైలర్ ప్రీమియర్ కోసం దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
