ఢిల్లీ పై చెన్నై గ్రాండ్ విక్టరీ

సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. దీంతో 27 పరుగుల తేడాతో చెన్నై విక్టరీ కొట్టింది.
అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి చెన్నై 167 పరుగులు చేసింది. శివమ్ దూబె (25) టాప్ స్కోరర్. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ (20; 9 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ (24), అజింక్య రహానె (21), అంబటి రాయుడు(23), జడేజా (21) పరుగులు చేశారు.