ఆ కవ్వింపు ఎవరికి ?

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కవ్వింపు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరికో హగ్ ఇస్తున్నట్లు, టీ తాగుతూ రిలాక్స్ అవుతున్న రెండు ఫోటోలు శ్రద్దా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పోజుల్లో శ్రద్దాలో ప్రేమ కనబడుతోంది. ఆమె ప్రత్యేకంగా ఎవరి కోసమే గిఫ్ట్ పంపించింది అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇక శ్రద్దా కెరీర్ విషయానికొస్తే.. ‘టీన్ పట్టి’ సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించింది. లవ్ కా ది ఎండ్ సినిమాలో కథానాయికగా నటించింది. Aashiqui 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. ఆ తర్వాత శ్రద్దాకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 23 సినిమాల్లో నటించింది. సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. డార్లింగ్ ప్రభాస్ కు సరిజోడు అనిపించుకుంది.