V6, వెలుగు అప్పుడు తీపి.. ఇప్పుడు చేధు !
ఆంధ్రా మీడియా హవా తట్టుకొని.. తెలంగాణ ఉద్యమాన్ని మోసిన న్యూస్ ఛానెల్, దినపత్రిక V6, వెలుగు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ రెండు కూడా ఉద్యమకారులే. ఆ సమయంలో V6, వెలుగు పాత్రను కేసీఆర్ మెచ్చుకున్నారు. ఏ మీటింగ్ జరిగినా.. తెలంగాణ మీడియాకు కృతజ్ణతలు చెప్పారు. ఐతే ఇప్పుడు అదే మీడియా కల్వకుంట్ల కుటుంబానికి చేదుగా మారింది. V6, వెలుగు లను బ్యాన్ చేస్తున్నట్లు ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
నిన్న నిజామాబాద్ సభలో ఎమ్మెల్సీ కవిత అయితే ఇకపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలెవ్వరూ V6, వెలుగు చూడొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. వాటికి ఇంటర్వ్యూలు, బైట్ ఇవ్వొద్దని చెప్పింది. అయితే ప్రశ్నిస్తున్న మీడియా పట్ల కల్వకుంట్ల ఫ్యామిలీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో చర్చ మొదలైంది. తీన్మార్ వార్తలు తియ్యగా ఉన్నాయని చెప్పిన కేసీఆరే.. ఇప్పుడు ఆ ఛానెల్ గొంతు పిసకాలని చెప్పడాన్ని ప్రజలు హర్షించడం లేదు. V6, వెలుగు లను కాదు.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.