‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌2’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే ?

నాలుగేళ్ల క్రితం (2019) విడుదలైన ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఈ వెబ్‌ సిరీస్ మొదటి సీజన్‌ను అద్భుతమైన ట్విస్ట్‌తో ముగించారు మేకర్స్‌. దీంతో దీని రెండో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. తాజాగా ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌2’ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఈ సిరీస్‌ ఆగస్టు 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్‌ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు.

ఈ సీజన్‌2కు జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. ఇద్దరు స్నేహితులు, వెడ్డింగ్ ప్లానర్లకు మధ్య జరిగే కథగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. ఇందులో శోభిత, అర్జున్ మాథుర్ వెడ్డింగ్‌ ప్లానర్స్‌గా నటించారు.