‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్ !

‘డీజే టిల్లు’తో హిట్ కొట్టారు సిద్దు జొన్నల గడ్డ. ఒక్క సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ.. ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రామ్ మల్లిక్ దర్శకత్వం వస్తున్నారు. సిద్దుకి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ‘టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా’ అంటూ సాగే ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించారు. యువతను ఆకట్టుకునే లిరిక్స్‌తో ఈ పాట సిద్ధమైంది. డీజే టిల్లు స్టోరీని కనెక్ట్ చేసేలా ఫస్ట్ సాంగ్ ను డిజైన్ చేశారు. దీంతో డీజే టిల్లు ఫేవర్ మిస్ కాకుండా మొదటి నుంచి జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.