జైలర్ రెండో సాంగ్ : షారుక్ ముందు నుంచి.. నయన్ వెనుక నుండి !

 కోలీవుడ్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా ‘జవాన్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షారుక్ కి జంటగా నయనతార జతకట్టారు. మరో హీరోయిన్ గా దీపికా పదుకొనె కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 7న జవాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో వేగం పెంచిన చిత్రబృందం.. ఇప్పటికే తొలి సాంగ్ #ZindaBanda రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

తాజాగా జవాన్ నుంచి రెండో సాంగ్ #Chaleya సోమవారం రాబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి వదిలారు. ఇందులో షారుక్ ఫ్రంట్ లుక్స్ తో అదరగొట్టగా.. నయన్ ను బ్యాక్ లుక్ లో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఆఖరులో లాంగ్ షాట్ లో చూపించినా.. అది హైలెట్ కాలేదు. అయితే ఏ యాంగిల్ లో చూసిన షారుక్ కి నయన్ సరిజోడిగా కనబడుతుంది.