జైలర్ బ్లాక్ బ్లాస్టర్ ! రెండ్రోజుల్లో రూ. 200 కోట్లు !

సూపర్ స్టార్ రజనీకాంత్ థియేటర్స్ లో కుమ్మేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘జైలర్’. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఫస్ట్ డే ఏకంగా రూ. 95.78 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు.. శుక్ర, శని .. రెండ్రోజుల కలెక్షన్స్ కలిపి రూ. 200 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

మరోవైపు రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత తమ కోరిక తీరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుత విజయంతో చిత్రబృందం హ్యాపీగా ఉంది. చిత్రబృందం సక్సెస్ సెలబ్రెషన్స్ లో మునిగిపోయింది. అయితే థియేటర్స్ దగ్గర రజనీ ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసి.. సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు.