పాకిస్తాన్ టార్గెట్ 267

ఆసియా కప్ లో భాగంగా భారత్ – పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 48 పరుగులకే మొదటి 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఇషాన్ కిషన్ (82), హార్ధిక్ పాండ్యా (87) ఆదుకున్నారు. ఆఖర్లో బుమ్రా 16 (14 బంతుల్లో) మెరులుపు మెరిపించినా.. భారత్ 266 పరుగులే చేయగలిగింది.

టీమిండియాను ఆదిలోనే దెబ్బకొట్టాడు పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రీది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. ఆ కొద్దిసేపటికే మంచి టచ్ లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ (14) హరిస్ రౌస్ వేసిన షాట్ పిచ్ బంతికి అవుటయ్యాడు. అప్పటి వరకు ఆచితూచి ఆడుతున్న శుభమన్ గిల్ (10) ను కూడా రౌఫ్ బౌల్డ్ చేశాడు. అయితే త్వరగా 4 వికెట్లు పోయినా.. టీమిండియా చేతులెత్తేయలేదు. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాక బౌలర్లకు సవాల్ విసిరారు. ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఇషాన్ కిషాన్ అవుటైన కొద్దిసేపటికి హార్ధిక అవుట్ కావడం .. ఆ వెంట వెంటనే జడేజా, శార్దూల్ ఠాకూర్ కూడా పెలివియన్ చేరడంతో.. భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆఖర్లో బుమ్రా తనదైన మార్క్ షాట్లతో అలరించడం విశేషం.