ప్రభాస్ స్థానంలో రామ్.. స్కంధ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ఈ నెలలో రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ వాయిదా పడింది. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికాని నేపథ్యంలో సినిమాని వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించారు. నవంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ‘సలార్’ ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు సలార్ సెప్టెంబర్ నెల నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని రామ్ పోతినేని ఆక్రమించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా స్కంధ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రామ్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా స్కంథ తెరకెక్కింది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సలార్ సెప్టెంబర్ 28 నుంచి పక్కకు జరగడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ.. స్కంధ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 28నే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.