ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. హరీష్ కు కోమటిరెడ్డి సవాల్ !
ఇటీవల అలకబూనిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. 24 గంటల కరెంట్ విషయంలో ఆయన మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. రైతులకు 24 గంటల కరెంట్ కాదు.. 20 గంటలు ఇస్తున్నామని రుజువు చేస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. మీరు ఎలాగూ పదవులను వదులుకోరు. సచ్చేదాక పదవులు అనుభవించాలని కోరుకుంటారు. మీకు పదవులు కావాలి. మాకు పదవులు అవసరం లేదు. ఎలాగూ.. మీరు పదవులు వదులుకోరు.. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని కనీసం రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరిస్తున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పదే పదే అలక పాన్పు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వేసిన కమిటీల్లో ఆయనకు చోటు దక్కడం లేదని.. తాను చెప్పిన వాళ్లకి అసెంబ్లీ టికెట్లు దక్కడం లేదని ఆయన అలిగారు. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోమటిరెడ్డి ఇంటికెళ్లి బుజ్జగించారు. అక్కడి నుంచే కేసీ వేణుగోపాల్ తో ఫోన్ లో మాట్లాడించారు. ఇక నిన్న తాజ్ కృష్ణ హోటల్ కు వెళ్లిన వెంకట్ రెడ్ది కేసీ వేనుగోపాల్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆయన యాక్టివ్ అయ్యారు. మంత్రి హరీష్ రావు మీద 24 గంటల కరెంట్ విషయంలో సవాల్ విసిరారు. మరీ.. హరీష్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది చూడాలి.