9 మందిని ఓడించడానికే మంత్రి పువ్వాడ పని చేస్తున్నరు !

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఘూటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మందిని ఓడించడానికే మంత్రి పని చేస్తున్నారని ఆరోపించారు. పువ్వాడ ఖమ్మం నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా ? ఖమ్మం జిల్లాకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేనా ? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో ఎమ్మెల్యే రాములు నాయక్ కు స్థానం లభించని విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాములు నాయక్ ను పక్కన పెట్టి.. ఆయన స్థానంలో  బానోతు మదన్‌లాల్‌ కు అవకాశం ఇచ్చారు కేసీఆర్. అయితే ఇటీవల రెడీ చేసిన దళిత బంధు లిస్టు విషయంలో మంత్రి పువ్వాడ.. ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్ మాటనే విన్నారట. ఆయన చెప్పినవాళ్లకి మాత్రమే దళిత బంధు లిస్టులో చోటు కల్పించారని సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ ఆరోపించారు. అంతేకాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాలను ఓడించడానికే పువ్వాడ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 


వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ కాస్త వీక్ గా కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఖమ్మం, పాలేరుతో పాటు కొత్తగూడెంలోనూ ప్రభావం చూపగల సీనియర్ నేత తుమ్ముల నాగేశ్వర్ రావు కూడా హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు పాలేరు నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయింది. ఇదీగాక.. ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న కామ్రెడ్లు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ వీక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.