పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘పుష్ప’ సినిమాతో సంచలన విజయం నమోదు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప రాజ్ గా నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో జాతీయ అవార్డును అందుకున్న తొలి నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. పుష్ప సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 #Pushpa2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప 2 రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ న్యూస్ బన్నీ అభిమానులకు పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఎందుకంటే ? రిలీజ్ డేట్ కు ఇంకా సమయం ఉంది. దాదాపు ఏడాది టైమ్ ఉంది. ఈ నేపథ్యంలో నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే పుష 2 రిలీజ్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు ఇది బ్యాడ్ న్యూస్ లాంటిదే మరీ.. !

సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో.. తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు ఫిదా అయ్యారు. సుక్కు స్క్రీన్ ప్లే.. ముఖ్యంగా క్లైమాక్స్ లో విలన్ – హీరోల మధ్య హీటెక్కించే సీన్ బాగా పేలింది. పుష్పరాజ్ మేనరిజం.. డైలాగ్స్.. విజువల్స్ … ఇలా ప్రతి ఒక్కటి బాగా కుదిరాయి. అయితే సీక్వెల్ విషయంలోనూ తగ్గేదెలా అంటున్నారు అల్లు అర్జున్. పుష్ప అంతకుమించి పుష్ప 2 ఉండబోతుందని చెప్పారు. ఇక సీక్వెల్ విషయంలో బన్నీ బాగా కష్టపడుతున్నారు. ప్రతి ఎక్సెప్రెషన్ బాగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఓ సినిమా వేడుకలో సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే.

అజయ్ దేవగన్ వర్సెస్ అల్లు అర్జున్ :

వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దగ్గా పోరు ఉండనుంది. అల్లు అర్జున్ పుష్ప2 తో పాటుగా రోహిత్ శెట్టి దర్శకత్వంలొ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన సింగర్ అగైన్ #SinghamAgain రిలీజ్ కానుంది. సింగం సిరీస్ సౌత్ లో సూపర్ హిట్ అయింది. ఇదే కథను రోహిత్ శెట్టి హిందీలోకి తీసుకొస్తున్నారు. అక్కడ కూడా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేయబోతున్నాయి.