అఫీషియల్ : లోకేష్ డైరెక్షన్ లో రజనీ 171

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీ కాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి నెల్సన్ దీలిప్ కుమార్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక తాజాగా రజనీకాంత్ తదుపరి సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజనీ తదుపరి సినిమా #Thalaivar171 రాబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అదే ఏడాది దివాళీ కానుకగా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించబోతుంది. రజనీకి జంటగా నటించబోయే హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం లోకేష్ లియో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.