సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఇవే !

తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభ వేదికగా సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించారు.మహిళలు, దళితులు, పేద వర్గాలకు పెద్దపీట వేస్తూ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చారు.  


1. మహాలక్ష్మి పథకం – మహిళలకు ప్రతీ నెల రూ.2500, కేవలం రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

2. రైతు భరోసా – ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ

3. రాజీవ్ యువ వికాసం – మొదటి ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

4. అంబేడ్కర్ అభయహస్తం – ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం

5. చేయూత – ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం

6. మహిళా సాధికారత- దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాల్లోని మహిళలకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం.