‘జవాన్’ ఓటీటీ రిలీజ్.. బిగ్ సర్‌ప్రైజ్

బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న షారుక్ ఖాన్ ‘జవాన్’ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జవాన్ ను సరికొత్తగా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అట్లీనే చెప్పారు.

సరైన నిడివి, ఎమోషన్స్‌తో ‘జవాన్’ థియేటర్ రిలీజ్ చేశాం. ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసరికి ఇంకాస్త రిథమ్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను దానిపైనే వర్క్ చేస్తున్నా. అందుకే హాలీడేకు కూడా వెళ్లలేదు. మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అంటే కొత్త సీన్స్ తో జవాన్ ఓటీటీలోకి రాబోతుంది అన్నమాట. అదెప్పుడు ? ఏ ఫ్లాట్ ఫామ్ లోకి అన్నది త్వరలో తెలియనుంది.