లియో తెలుగు పోస్టర్

కోలీవుడ్ స్టార్ విజయ్ అభిమానులకు నిరాశే ఎదురైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా ‘లియో’. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. త్రిష, సంజయ్ దత్, అర్జున్ ఇలా స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న లియో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే  ప్రమోషన్స్ షురూ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ను రిలీజ్ చేసింది. వాటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఇవాళ లియో డేట్ రానుంది. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా జరిగింది. 

అయితే చిత్రబృందం సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. లియో తెలుగు పోస్టర్ ను స్వయంగా విజయ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఇందులో విజయ్ చాలా కూల్ గా కనబడుతున్నారు. మరో పిక్ లో కాశ్మీర్ లొకేషన్స్ లో పరుగులు తీస్తూ కనబడుతున్న విజయ్ లుక్ ఆకట్టుకుంటుంది. విక్రమ్ తర్వాత లోకేష్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.