ఆసియా కప్ ఫైనల్ : శ్రీలంక 50 ఆలౌట్


ఆసియా కప్ ఫైనల్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు మ్యాజిక్ చేశారు. లంకను కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేశారు. హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంక నడి విరిచాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక బ్యాటర్ల బేజారయ్యారు. 

శ్రీలంక బ్యాటర్లు సమరవిక్రమ, చరిత్ అసలంక, డాసున్ శానకలను డకౌట్‌ చేసిన సిరాజ్‌.. ధనంజయ డిసిల్వా (4), నిస్సాంక (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. సిరాజ్ కు తోడుగా హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టడంతో లంక 50 పరుగులకే ఆలౌట్ అయింది.