మృణాల్ హాటు.. స్వీటు !

జెర్సీ (హిందీ), సీతరామం తో మృణాల్ ఠాకూర్ ఫేట్ మారిపోయింది. తెలుగు, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తోంది. ఇందులో మూడు హిందీ సినిమాలు (పూజా మేరీ జాన్, పిప్పా, ఆంక్ మిచోలీ), రెండు తెలుగు సినిమాలు హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ (13వ చిత్రం) చిత్రాలు ఉన్నాయి.

మరోవైపు ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్స్, సినీ ఫంక్షన్ లో వెరీ వెరీ స్పెషల్ అనిపించుకుంటోంది. ఈరోజు హాటుగా కనిపించిన మృణాల్.. రేపు అందుకు భిన్నంగా స్వీటుగా మారిపోతుంది. మొత్తానికి.. ఏ యాంగిల్ లోనైనా ఫుల్లుగా ఆకట్టుకుంటోంది. నిన్న రెడ్ డ్రెస్ లో మృణాల్ కేకపుట్టించిన సంగతి తెలిసిందే. ఇవాళ వినాయక ఉత్సవాల్లో నిండు చీరలో అందరి కళ్లు తనవైపు తిప్పుకున్నది. బాలీవుడ్ హీరో ఆర్యన్ ఖాన్ ఇంట్లో జరిగిన పూజలో ఆకుపచ్చ చీర కట్టుకొని హాజరైంది. మంత్రముగ్దుల్ని చేసింది. మొత్తానికి.. మృణాల్ మాయ చేస్తోంది అన్నడంలో అతిశయోక్తి లేదు.
