రెండు భాగాలుగా ‘దేవర’ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘దేవర’ ఫిల్మ్ రెండు భాగాలుగా రాబోతుంది. ఈ మేరకు దర్శకుడు కొరటాల శివ ప్రకటించేశారు. మాయమైపోతున్న కోస్టల్ ల్యాండ్స్ నేపథ్యంలో దేవర సినిమా తెరకెక్కుతోంది. తారక్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కథ అనుకున్నదాని కంటే పెద్దగా వస్తుందట.

ఈ నేపథ్యంలో సినిమాని రెండు పార్టులుగా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు కొరటాల తెలిపారు. అయితే కథలో ఎలాంటి మార్పు-చేర్పులు చేయడం లేదు. మొదట అనుకున్న కథనే.. నిడివి దృష్ట్యా రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న రిలీజ్ చేయబోతున్నట్లు కొరటాల ఎనౌన్స్ చేశారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు రెండు పార్టులుగా రావడం సాధారణ విషయం అయిపోయింది. సింగిల్ స్క్రిప్ట్ తో పట్టాలెక్కిన పుష్ప.. ఆ తర్వాత రెండు భాగాలు అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు దేవర కూడా రెండు పార్టులుగా కనువిందు చేయనుంది.
#DEVARA To Release In Two Parts.
👉First part to release on 5 April 2024#NTRJr #JanhviKapoor #SaifAliKhan #KoratalaSiva #JrNTR #NTR30 #OTTRelease pic.twitter.com/QaOv8niOSm— OTTRelease (@ott_release) October 4, 2023