‘భగవంత్ కేసరి’ ట్రైలర్ టైమ్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ మరోసారి గర్జించబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఆయన నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ పీక్స్ కు తీసుకెళ్లే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇందులో భాగంగా రేపు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆదివారం రాత్రి 8:16 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

అఖండ తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ నే. కాకపోతే.. అంతర్లీనంగా అనిల్ రావిపూడి మార్క్ వినోదం ఉండనుంది. యాక్షన్ కంటే డైలాగ్స్ అద్భుతంగా కుదిరాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటించారు. ఇక ఆయనకు చెల్లెలు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు. అమెరికా, యూకే లోనూ ‘భగవంత్ కేసరి’ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని యూకే, ఐర్లాండ్ లో 2 జీ ఎంటర్ టైనర్ మెంట్స్ రిలీజ్ చేయబోతుంది. ఒకరోజు ముందే అంటే.. అక్టోబర్ 18న అక్కడ ప్రీమీయర్ షోస్ ప్రదర్శించనున్నారు.