దక్షిణాఫ్రికా బ్యాటర్ల ఊచకోత.. శ్రీలంక ముందు 429 టార్గెట్ !

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. క్వింటన్ డికాక్ (100), వాన్ డెర్ డస్సెన్ (108), మార్క్రమ్ (106) సెంచరీలు చేయడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 భారీ స్కోరు చేసింది. అనంతరం బరిలోకి దిగిన లంక 5 ఓవర్లు పూర్తయ్యే వరకు వికెట్ నష్టానికి 37 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

మరో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 156 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.