టీమిండియాకు గోల్డ్ మెడల్

ఆసియా టీమిండియా మహిళల జట్టు ఇప్పటికే స్వర్ణం పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పురుషుల జట్టు కూడా గోల్డ్ మెడల్ సాధించింది. భారత్- అఫ్గాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది.

అయితే వర్షం ఎంతకి తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చి.. టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం గెల్చుకోగా.. అఫ్గాన్ రజతం అందుకుంది.