టీమిండియా ఘన విజయం.. 273 టార్గెట్ ను 35 ఓవర్లలో ఊదేశారు !

వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అయితే 273 టార్గెట్ ను టీమిండియా 35 ఓవర్లలోనే ఊదేసింది.

రోహిత్ శర్మ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) అఫ్గాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఇషాన్ కిషన్ (47), విరాట్ కోహ్లీ (55), శ్రేయస్ అయ్యర్ (25) కూడా రాణించారు. ఈ విజయంతో వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. ఇక శనివారం (అక్టోబర్ 14) టీమిండియా పాకిస్థాన్ తో తలపడనుంది. అహమ్మదాబాద్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది.
