#BhaiyyaJi ట్రైలర్ ఎప్పుడంటే ?

దేశీ సూపర్ స్టార్ మనోజ్ బాజ్ పేయి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ఓటీటీలో సూపర్ స్టార్ గా దూసుకెళ్తున్నారు. మరోవైపు థియేటర్స్ లో ఆయన సినిమాలు అదరగొడుతోంది. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న వందో సినిమా #BhaiyyaJi విడుదలకు రెడీ అవుతోంది. ఈ నెల 24న విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసింది. తాజాగా ట్రైలర్ కు ముహూర్తం ఫిక్సయింది. రేపు మధ్యాహ్నం 12:38 గంటలకు #BhaiyyaJiTrailer ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నటుడు మనోజ్ బాజ్ పేయి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహిస్తున్నారు.